News November 13, 2025
తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం

దేశీయ మంచి నీటి చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం తెలంగాణలోని రంగారెడ్డి(D) కోహెడలో 13ఎకరాలను ఎంపిక చేసింది. దీని ఏర్పాటుకు రూ.47 కోట్లను మంజూరు చేసింది. దేశంలోని జలాశయాలు, డ్యాములు, చెరువులు, కుంటల్లో చేపలను దేశవిదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News March 13, 2026
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్‌కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 24న CJ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా చరిత్రకెక్కనున్నారు.
News March 13, 2026
42 ఏళ్లు కోమాలో ఉన్న అరుణ గురించి తెలుసా?

12 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఇటీవల <<19352489>>అనుమతిచ్చింది.<<>> ఈ తీర్పునకు ముంబైకి చెందిన నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు స్ఫూర్తి. 1973లో ఆమెను రేప్ చేసి దాడి చేయడంతో 42 ఏళ్లపాటు కోమాలో ఉండి 2015లో చనిపోయారు. 2009లో ఆమె కారుణ్య మరణం కోసం ఓ జర్నలిస్టు పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 2011, 2018, 2023లో వెలువడిన తీర్పులు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశాయి.
News March 13, 2026
కారుణ్య మరణంపై 2011, 2018 తీర్పులు ఏం చెప్పాయి?

సరైన రక్షణ చర్యలు, స్థానిక హైకోర్టు ఆమోదంతో <<19352489>>కారుణ్య మరణానికి<<>> చట్టబద్ధత ఉంటుందని 2011లో సుప్రీం వెల్లడించింది. కోలుకోవడం సాధ్యం కానప్పుడు లైఫ్ సపోర్టును తొలగించవచ్చని, దీనిపై పార్లమెంటులో చట్టం చేయాలని సూచించింది. ఆర్టికల్ 21 గౌరవప్రదంగా జీవించే హక్కుతోపాటు గౌరవప్రదంగా మరణించే హక్కునూ కల్పిస్తుందని 2018లో పేర్కొంది. 2023లో పలు సవరణలతో కారుణ్య మరణంపై తుది తీర్పు వెలువడింది.


