News November 13, 2025

మెన్‌స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

image

ఒక మెన్​స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్​ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్‌ స్కిప్పింగ్‌ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్‌స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.

Similar News

News March 7, 2026

సెంటిమెంట్.. హోటల్‌ను మార్చిన టీమ్ఇండియా

image

T20 WC విజేతగా నిలిచేందుకు టీమ్ఇండియా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దృష్టిలో ఉంచుకొని, సెంటిమెంట్ పరంగా ఆ టైమ్‌లో బస చేసిన ITC నర్మదలో కాకుండా తాజ్ స్కై లైన్‌కు బస మార్చేసింది. అహ్మదాబాద్‌లో రేపు న్యూజిలాండ్‌తో ఫైనల్ జరగనుండగా చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఇటీవల చంద్రగ్రహణం టైమ్‌లోనూ జట్టు ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే.

News March 7, 2026

సర్కారు బడి పిల్లలకు గుడ్ న్యూస్.. వారానికో రోజు ఫిష్!

image

TG: ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఇస్తున్న చికెన్ స్థానంలో వారానికి ఒకరోజు చేపలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కొత్త మెనూ అమలు చేసే అవకాశం ఉంది. ఒక వారం చికెన్, మరో వారం చేపలు అందించేలా ప్రత్యామ్నాయ మార్గాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.

News March 7, 2026

గుడ్‌న్యూస్.. వారికి వేతనాలు పెంపు!

image

AP: జలవనరుల శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పని చేసే లస్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రోజు వారీగా ఇస్తున్న ₹350ని ₹550కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో లస్కర్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు జీతం పెరిగింది. సాగునీటి కాలువలు, తూముల నుంచి నీటి విడుదల, షట్టర్ల మూత, నిర్వహణ, లీకేజీల గుర్తింపు, మరమ్మతు పనులు, పహారా వంటివి లస్కర్లు చూసుకుంటారు.