News November 13, 2025
పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో CM చంద్రబాబు

విశాఖలో CII సుమ్మిట్‌లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నట్లు CM పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో మృతదేహం

ఆరిలోవ స్టేషన్ పరిధి జోడుగుళ్లపాలెం బీచ్‌కు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం ఉదయం కొట్టుకొచ్చిందని పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని.. రెండు చేతుల మీద పచ్చబొట్లు ఉన్నాయని చెప్పారు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని సీఐ మల్లేశ్వరరావు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామన్నారు.
News November 13, 2025
విశాఖలో నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్..

CII సమ్మిట్‌కు ముందుగా దేశంలోని ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, CEOలు, విదేశీ రాయబారులతో CM చంద్రబాబు నేడు భేటీ కానున్నారు.
➣ఉదయం నోవాటెల్‌లో ఇండియా-యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం
➣‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’- సస్టైనబుల్ గ్రోత్‌పై ప్రారంభ సెషన్
➣మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ
➣ సాయంత్రం‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’పై కార్యక్రమం
➣ CII నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
News November 12, 2025
విశాఖ: ఈనె 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విశాఖలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న చిత్రలేఖనం,17న వకృత్వ పోటీలు,18న సభ్యత్వ సేకరణ, 19న ఇందిరాగాంధీ జయంతి, మ్యూజికల్ చైర్ పోటీలు, 20న గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రంథాలయ అధికారులు తెలిపారు.


