News November 13, 2025

కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

image

కడప కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన చిన్న సుంకిరెడ్డికి ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైలు అధికారులు వెల్లడించారు.

Similar News

News November 13, 2025

వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు: KTR

image

తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతిని కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టారని, వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని కేటీఆర్ ‘X’లో పేర్కొన్నారు.

News November 13, 2025

క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

image

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.

News November 13, 2025

JGTL: తేమ పేరుతో ఇబ్బందులు పెడితే చర్యలు: మంత్రి

image

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. టార్పాలిన్‌లు, తూకం, శుద్ధి యంత్రాలు అందుబాటులో ఉండాలన్నారు. క్లస్టర్ అధికారులు కేంద్రాలను ప్రతిరోజూ పరిశీలించాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకొని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులకు తేమ శాతం పేరుతో ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.