News November 13, 2025
పెద్దిరెడ్డి భూములపై విచారణకు పవన్ ఆదేశం..!

మంగళం పేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్‌పై నివేదిక తయారు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న అమరావతిలో అధికారులతో మాట్లాడారు. వారసత్వంగా వచ్చిన భూములు క్రమంగా ఎలా పెరుగుతూ వచ్చాయని, ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారట. ఇప్పటికే ఫారెస్ట్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, విచారించిన ఫైల్స్‌ను పంపినట్లు సమాచారం.
Similar News
News November 13, 2025
క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.
News November 13, 2025
JGTL: తేమ పేరుతో ఇబ్బందులు పెడితే చర్యలు: మంత్రి

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. టార్పాలిన్‌లు, తూకం, శుద్ధి యంత్రాలు అందుబాటులో ఉండాలన్నారు. క్లస్టర్ అధికారులు కేంద్రాలను ప్రతిరోజూ పరిశీలించాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకొని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులకు తేమ శాతం పేరుతో ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
News November 13, 2025
VJA: దుర్గగుడిలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఈవో

దుర్గగుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆలయ ఈఓ శీనా నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాలకమండలి ఛైర్మన్ గాంధీ, యాగశాల దాత సంగ నరసింహారావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిపై డిప్యూటీ ఇంజినీర్ అశోక్ కుమార్ వివరించగా, త్వరితగతిన పూర్తి చేయాలని ఈఓ ఆదేశించారు. భవానీ దీక్షల ఏర్పాట్లను కూడా సమీక్షించారు.


