News November 13, 2025
శ్రీరాంపూర్: 17న 100 మస్టర్లు లేని ఉద్యోగులకు కౌన్సిలింగ్

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల వరకు 100 మస్టర్లు లేని ఉద్యోగులు ఈనెల 17న జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని మేనేజర్ తిరుపతి సూచించారు. ఏ, బీ రిలే ఉద్యోగులకు ఉ.9 నుంచి 12 గంటల వరకు, సి, డి రిలే ఉద్యోగులకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు గని కార్యాలయం, క్యాంటీన్‌లో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
పాలకీడు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

పాలకీడు మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అడ్డ రోడ్ వద్ద కంకర టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మహంకాళి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని ప్రమాద తీరును పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 13, 2025
సిరిసిల్ల: ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాలి

బాలికలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం.చందన అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంపై సిరిసిల్ల కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు.
News November 13, 2025
ఉసిరిలో కాయకుళ్లు, నల్లమచ్చ తెగుళ్ల నివారణ

కాయకుళ్లు తెగులు సోకిన ఉసిరి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాటి నుంచి చెడువాసన వస్తుంటుంది. దీని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ లేదా 1% బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీయాలి. ఉసిరిలో నల్లమచ్చ తెగులు వల్ల కాయలపై నల్ల మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమంగా పెద్దవి అవుతాయి. తెగులు కట్టడికి లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేయాలి.


