News November 13, 2025
WGL: వండర్ హాట్ మిర్చి రూ.19,500

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు పెరిగాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.18,300 ధర రాగా.. నేడు రూ.18,700 అయింది. వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.17,500 పలికితే.. ఈరోజు రూ.19,500 అయింది. తేజ మిర్చికి నిన్న రూ. 14,900 ధర వస్తే.. ఇవాళ రూ.14,650 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి నిన్న రూ.15, 500 పలకగా ఈరోజు రూ.16,500 అయింది.
Similar News
News November 13, 2025
ఉసిరిలో కాయకుళ్లు, నల్లమచ్చ తెగుళ్ల నివారణ

కాయకుళ్లు తెగులు సోకిన ఉసిరి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాటి నుంచి చెడువాసన వస్తుంటుంది. దీని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ లేదా 1% బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీయాలి. ఉసిరిలో నల్లమచ్చ తెగులు వల్ల కాయలపై నల్ల మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమంగా పెద్దవి అవుతాయి. తెగులు కట్టడికి లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేయాలి.
News November 13, 2025
తాజా సినీ ముచ్చట్లు

⋆ కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ నటించబోయే సినిమా నుంచి అనివార్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ సి.సుందర్
⋆ అట్లీ-అల్లు అర్జున్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మే నాటికి బన్నీ షూటింగ్ పూర్తవుతుంది: సినీ వర్గాలు
⋆ దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ, సముద్రఖని నటించిన ‘కాంత’ సినిమాకు U/A సర్టిఫికెట్.. సినిమా నిడివి 2.40hrs.. రేపే థియేటర్లలో విడుదల
News November 13, 2025
‘బాల్య వివాహాల రహితంగా సిరిసిల్ల జిల్లాను మార్చాలి’

బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం.చందన పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాలు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.


