News November 13, 2025
ఘంటానాదం వెనుక శాస్త్రీయత

శబ్దాలు 2 రకాలు. అవి ధ్వని, నాదం. ఒకసారి వచ్చి ఆగేది ధ్వని. కొంతసేపు కొనసాగేది నాదం. గుడిలో గంట శబ్ధం నాదాన్ని సృష్టిస్తుంది. ‘నాదం’ అంటే ప్రాణం, అగ్ని కలయిక. ధ్వని మనసుకు చికాకు కలిగిస్తుంది. కానీ నాదం అలా కాదు. గుడిలోని ఘంటానాదం చెవులకు, మన ఆరోగ్యానికి చాలా మందిది. ఇది చెవులకు వ్యాయామంలా పనిచేస్తుంది. ఘంటానాద తరంగాలు రోగ క్రిములను దూరం చేస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. <<-se>>#Scienceinbelief<<>>
Similar News
News March 20, 2026
మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!

TG: డ్రగ్స్ కేసులో <<19404520>>అరెస్టయిన<<>> Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. జంగయ్య అనే వ్యక్తి పేరుతో ల్యాండ్ ఉందని సమాచారం. దీంతో ఆ భూమి రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకుంటామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఫామ్‌హౌస్‌ను సీజ్ చేస్తామంటున్నారు.
News March 20, 2026
PHOTO GALLERY: గద్దర్ అవార్డుల వేడుక

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ, నారాయణ మూర్తి, రామ్ చరణ్, సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అవార్డుల విజేతలు హాజరయ్యారు. పైన గ్యాలరీలో కొన్ని ఫొటోలను చూడొచ్చు.
News March 20, 2026
మార్చి 20: చరిత్రలో ఈ రోజు

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం


