News April 12, 2024
ఈనెల 14న గాజువాకలో చంద్రబాబు సభ

ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 14న జిల్లాకు రానున్నారు. ఆరోజు సాయంత్రం గాజువాక లంకా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రికి అనకాపల్లి వెళ్లి బస చేయనున్నారు. 15న అనకాపల్లి జిల్లాలో జరిగే ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సమాచారం వచ్చిందని, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు.
Similar News
News October 6, 2025
కంచరపాలెం ఘటనలో విస్తుపోయే నిజాలు

కంచరపాలెం ఇందిరానగర్-5 <<17925697>>చోరీ ఘటన<<>>లో విస్తుపోయే నిజాలు వెలువడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి హాల్లో పడుకున్న ఎల్లమ్మ నోటికి ప్లాస్టర్ వేసి 6బంగారు గాజులు, 2తులాల చైన్ లాక్కున్నారు. పక్కగదిలో పడుకున్న కృష్ణకార్తీక్ రెడ్డి కాళ్లు,చేతులు కట్టి చేతులతో కొట్టి బంగారు ఉంగరం, బీరువాలో రూ.3లక్షల నగదు దోచేశారు. బాధితుల కారులోనే పరారైనట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు.
News October 6, 2025
సిరిపురం వద్ద ఇంటర్ విద్యార్థి మృతి

విశాఖలో ఆదివారం అర్ధరాత్రి విషాదరం నెలకొంది. సిరిపురం జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో మహారాణిపేటలోని ఊటగెడ్డకు చెందిన హరీష్(17) మృతి చెందాడు. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
News October 6, 2025
విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతుంది

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతోందని జీవీఎంసీ అదనపు కమిషన్ డి.వి. రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకర్‌రావు తెలిపారు. దసరా సందర్భంగా ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక విరామం ఇచ్చారు. పలువురు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకున్నప్పటకీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగిచేందుకు ఆపరేషన్ లంగ్స్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.