News November 13, 2025
రాజన్న సిరిసిల్ల: ‘మత్తు వదిలిస్తున్నారు’..!

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ పగడ్బందీ చర్యలు చేపడుతోంది. దీంతో మందుబాబులు తాగి బండ్లు నడపాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఎక్కువ ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడిపే సమయాల్లోనే జరుగుతుండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌తో అలాంటి వాళ్లకు జిల్లా పోలీసులు చెక్ పెడుతున్నారు. జిల్లాలో గత 11నెలల్లో దాదాపు 11వేల కేసులు నమోదు కాగా, రూ.90 లక్షలకుపైగా జరిమానాలు విధించారు. 230మందికి జైలుశిక్షలు పడేలా చేశారు.
Similar News
News November 13, 2025
నిరూపిస్తారా.. క్షమాపణ చెబుతారా: మిథున్

AP: మంగళంపేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమపై <<18274471>>ఆరోపణలు<<>> చేస్తున్నారని YCP MP మిథున్ రెడ్డి ఫైరయ్యారు. ‘ఆ భూమిని 2000లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పుడు అధికారంలో ఉంది మేం కాదు. ఆ భూమి డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లో ఉంది. ఎవరైనా చూడవచ్చు. మీ ఆరోపణలను నిరూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా’ అని సవాల్ విసిరారు. గతంలో ఎర్రచందనం విషయంలో సవాల్ చేస్తే పారిపోయారని విమర్శించారు.
News November 13, 2025
అయిజ: రేపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

అయిజ మార్కెట్ సబ్ యార్డులో రేపు (శుక్రవారం) సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి గురువారం Way2News తో తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలో అయిజ, గట్టు, మల్దకల్ మండలాల రైతులు మొక్కజొన్న విక్రయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.
News November 13, 2025
నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.


