News November 13, 2025

గద్వాల: డీకే అరుణకు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు

image

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025పై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)లో ఆమెను సభ్యురాలిగా నియమించారు. జమ్మూ కశ్మీర్ పునశ్చరణ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలనూ ఈ కమిటీ పరిశీలిస్తుంది.

Similar News

News November 13, 2025

నిరూపిస్తారా.. క్షమాపణ చెబుతారా: మిథున్

image

AP: మంగళంపేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమపై <<18274471>>ఆరోపణలు<<>> చేస్తున్నారని YCP MP మిథున్ రెడ్డి ఫైరయ్యారు. ‘ఆ భూమిని 2000లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పుడు అధికారంలో ఉంది మేం కాదు. ఆ భూమి డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లో ఉంది. ఎవరైనా చూడవచ్చు. మీ ఆరోపణలను నిరూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా’ అని సవాల్ విసిరారు. గతంలో ఎర్రచందనం విషయంలో సవాల్ చేస్తే పారిపోయారని విమర్శించారు.

News November 13, 2025

అయిజ: రేపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

అయిజ మార్కెట్ సబ్ యార్డులో రేపు (శుక్రవారం) సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి గురువారం Way2News తో తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలో అయిజ, గట్టు, మల్దకల్ మండలాల రైతులు మొక్కజొన్న విక్రయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.

News November 13, 2025

నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.