News November 13, 2025

జగిత్యాల‌: పుట్టినరోజు నాడే యువకుడి సూసైడ్

image

జగిత్యాల‌కు చెందిన అనుమండ్ల కళ్యాణ్(26) పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 10 నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన ఇతడు మంగళవారం జన్మదినం సందర్భంగా రోజంతా తమతో ఫోన్ మాట్లాడాడని.. అంతలోనే అర్ధరాత్రి రూంలో ఉరివేసుకున్నాడని తోటి స్నేహితులు తమకు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, తమ కళ్యాణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 13, 2025

నిరూపిస్తారా.. క్షమాపణ చెబుతారా: మిథున్

image

AP: మంగళంపేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమపై <<18274471>>ఆరోపణలు<<>> చేస్తున్నారని YCP MP మిథున్ రెడ్డి ఫైరయ్యారు. ‘ఆ భూమిని 2000లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పుడు అధికారంలో ఉంది మేం కాదు. ఆ భూమి డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లో ఉంది. ఎవరైనా చూడవచ్చు. మీ ఆరోపణలను నిరూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా’ అని సవాల్ విసిరారు. గతంలో ఎర్రచందనం విషయంలో సవాల్ చేస్తే పారిపోయారని విమర్శించారు.

News November 13, 2025

అయిజ: రేపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

అయిజ మార్కెట్ సబ్ యార్డులో రేపు (శుక్రవారం) సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి గురువారం Way2News తో తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలో అయిజ, గట్టు, మల్దకల్ మండలాల రైతులు మొక్కజొన్న విక్రయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.

News November 13, 2025

నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.