News November 13, 2025
MNCL: 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

మంచిర్యాల శ్రీశ్రీ నగర్‌లోని ఆనంద నిలయంలో ఈ నెల 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఈ కేంద్రంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 13, 2025
తిరుమల: ఘంటా మండపం విశిష్టత ఏంటంటే..?

తిరుమల సోపాన మార్గంలోని అవ్వాచారి కోనకు దగ్గరగా ఉండే ఘంటా మండపం శ్రీవారి నైవేద్య సమయాన్ని సూచిస్తుంది. 1630 ప్రాంతంలో వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు ఈ ఘంటను చంద్రగిరి రాజు రామదేవరాయలకు బహూకరించారు. తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగే గంటల ధ్వని ఈ మండపంలోని గంటలను తాకగానే, అవి మోగేవి. ఈ శబ్దం వినిపించాకే చంద్రగిరిలోని రాజు భోజనం చేసేవారని ప్రతీతి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 13, 2025
ఫ్రీ బస్సు.. ఆర్టీసీకి రూ.400 కోట్ల చెల్లింపు

AP: స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్కీమ్ ప్రారంభించిన ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు ఫ్రీ టికెట్లకు అయిన ఖర్చు రూ.400 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. దీనిపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదని పేర్కొన్నాయి. కనీసం 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, 10వేల మంది సిబ్బందిని నియమించాలని కోరాయి.
News November 13, 2025
మక్తల్: పడమటి ఆంజనేయ స్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

పడమటి ఆంజనేయస్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతర డిసెంబర్ 2న ప్రారంభం కానుందని, నవంబర్ 30న కోనేరు ప్రారంభ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, కోనేరు వద్ద స్నాన గదులు (స్త్రీ–పురుషులకు వేరు), శానిటేషన్, సీసీ కెమెరాల నిఘాతో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.


