News November 13, 2025
జంగారెడ్డిగూడెం: చోరీకి పాల్పడిన దొంగ అరెస్ట్

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో సెప్టెంబరు 22న వందనపు లక్ష్మీ కుమారి ఇంట్లో జరిగిన రూ. 42 లక్షల దోపిడీ కేసులో, గతంలో నలుగురిని అరెస్టు చేయగా, తాజాగా కావేటి చిన్నను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుస్మిత రామనాథన్ గురువారం తెలిపారు. నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 13, 2025
పరిస్థితి తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: SC

ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్‌గా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.
News November 13, 2025
లడ్డూలతో రాజకీయం ఏంటి?: శ్రీవారి భక్తుల ఆగ్రహం

పవిత్రమైన <<18276380>>లడ్డూ ప్రసాదాన్ని<<>> చూపిస్తూ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ రాజకీయం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ధర్మారెడ్డి విచారణకు వచ్చిన సమయంలోనూ లడ్డూలు చూపించి పబ్లిసిటీ స్టంట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలోనే.. తిరుపతి ప్రెస్ క్లబ్లో లడ్డూలు, వడ ప్రసాదాలను బెంచిపై పెట్టి ప్రదర్శించారు. ఇలా లడ్డూలను ముందు పెట్టి రాజకీయం కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని పలువురు కోరుతున్నారు.
News November 13, 2025
4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.


