News April 12, 2024
సీఎం జగన్ పోటీ చేసేది ఈమెనే

భారత చైతన్య యువజన పార్టీ తరఫున పులివెందులలో సీఎం జగన్‌పై సూరే నిర్మల పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ క్రమంలో జగన్ పై పోటీ చేస్తున్న మొదటి మహిళగా నిలవనున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో నిర్మల పోటీ చేస్తుండటంతో బీసీల ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.
Similar News
News January 14, 2026
గండికోటలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం

గండికోట ఉత్సవాలలో సినీనటుడు, రాయచోటి వాసి కిరణ్ అబ్బవరం సందడి చేశారు. యువతతో ఫొటోలు తీసుకుంటూ కలియతిరిగారు. అనంతరం మాట్లాడుతూ.. తనని ఈ ఉత్సవాలకు ఆహ్వానించిన కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 20-25 ఏళ్ల వయసులోని యువత వారి ఆలోచనా విధానం కేవలం సంపాదించాం, ఎంజాయ్ చేశామన్న చిన్నపాటి సంతోషాలకే పరిమితం అవుతున్నారు. కానీ అది కాదు జీవితం. కెరీర్ పరంగా సుస్థిర స్థానం పొందాలిని యువతకు సూచించారు.
News January 13, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
News January 13, 2026
కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.


