News November 13, 2025
సిరిసిల్ల: ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాలి

బాలికలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం.చందన అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంపై సిరిసిల్ల కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు.
Similar News
News November 13, 2025
అనకాపల్లి: ‘సచివాలయాల వద్ద అంగన్వాడీలు ధర్నా’

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి కార్యకర్తలు ఈనెల 14వ తేదీన జిల్లాలో గల సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి తెలిపారు. గురువారం అనకాపల్లిలో నిర్వహించిన యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ శేషు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు.
News November 13, 2025
సూర్యాపేట: 5,560 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

అధిక లాభాలు చేకూర్చే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేసేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్‌లో పీఏసీఎస్, అధ్యక్షులు, కార్యదర్శులు, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో ఆయిల్ పామ్ సాగుపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 5,560 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగిందని అన్నారు.
News November 13, 2025
క్యురేటర్‌తో గంభీర్, గిల్ సుదీర్ఘ చర్చ.. పిచ్‌పై అసంతృప్తి?

కోల్‌కతా వేదికగా రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ క్యురేటర్ సుజన్ ముఖర్జీతో కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పిచ్‌ను కోచింగ్ టీమ్, BCCI క్యురేటర్లు, గిల్, పంత్ తదితరులు పరిశీలించారు. తర్వాత 30 నిమిషాలపాటు డిస్కషన్ జరిగింది. పిచ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


