News November 13, 2025
ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్‌లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్‌ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
Similar News
News November 13, 2025
ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.
News November 13, 2025
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్‌ఫర్డ్ సొంతం.
News November 13, 2025
అల్ ఫలాహ్ వర్సిటీకి షాక్

ఉగ్ర మూలాలు బయటపడిన ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) చర్యలు తీసుకుంది. సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కళాశాలకు గుర్తింపు ఉందంటూ వెబ్‌సైట్‌లో ప్రదర్శించినందుకు వర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి ఫండింగ్, డాక్టర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.


