News November 13, 2025
నాగార్జున- సురేఖ కేసు.. DEC2కు విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసు మరోసారి వాయిదా పడింది. HYDలోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే పరువునష్టం దావా వేసినట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News November 13, 2025
జిల్లాలో వారిపై నిఘా ఉంచాలి: అనకాపల్లి ఎస్పీ

జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ తుహీన్ సిన్హా పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గత నెలలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, పెండింగ్ వారెంట్లుపై ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సమన్వయం కొనసాగిస్తూ కేసులలో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News November 13, 2025
2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.
News November 13, 2025
స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.


