News April 12, 2024
IPL: లక్నోకు బ్యాడ్‌న్యూస్.. మయాంక్ దూరం

ఇవాళ ఢిల్లీతో మ్యాచుకు ముందు లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సంచలన పేసర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా నేటి మ్యాచుకు దూరం కానున్నారు. ఈనెల 7న గుజరాత్‌తో గేమ్ సందర్భంగా తుంటి గాయంతో అతడు అర్ధంతరంగా మైదానాన్ని వీడారు. గాయం ఇంకా మానకపోవడంతో ఎల్లుండి కోల్‌కతాతో గేమ్‌కూ అందుబాటులో ఉండడని LSG ప్రకటించింది. అయితే 19న చెన్నైతో మ్యాచుకు అతడు కోలుకుంటాడని ఆ జట్టు కోచ్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 4, 2026
ఇరాన్ యుద్ధానికి ₹18.8 లక్షల కోట్లు..

ఇరాన్‌పై దాడుల్లో తొలి 24 గంటల్లోనే US దాదాపు ₹6,900 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ యుద్ధం నెల రోజులు సాగితే మొత్తం ఖర్చు ₹18.87 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. భారీ విమానవాహక నౌక ‘USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ నిర్వహణకే రోజుకు ₹58 కోట్లు ఖర్చవుతోందని సమాచారం. చమురు ధరలు పెరగడం, ట్రేడ్ డిస్టర్బెన్సెస్ వల్ల USకు అదనంగా మరో $115 బిలియన్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
News March 4, 2026
ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News March 4, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

యుద్ధం మొదలైన రోజు అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,850 పతనమై రూ.1,50,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.20వేలు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.


