News November 13, 2025

NRPT: సమాచార కమిషనర్ల రాక

image

నారాయణపేటకు శుక్రవారం సమాచార కమిషనర్లు వస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు శ్రీనివాసరావు, మౌసిన పర్వీన్ కలిసి పౌర సమాచార అధికారులకు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అనంతరం పెండింగ్ అప్పీళ్లు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు.

Similar News

News November 13, 2025

అలంపూర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

image

అలంపూర్ చౌరస్తా నుంచి బుక్కాపురానికి ప్యాసింజర్‌తో వెళ్తున్న ఆటో కోనేరు గ్రామానికి దగ్గర్లో అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న 6 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో సకాలంలో ఘటన స్థలానికి ఉండవెల్లి, అల్లంపూర్ 108 అంబులెన్స్‌లు చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందించి అలంపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తీసుకెళ్లారు.

News November 13, 2025

విశాఖలో 99పైసలకే రహేజాకు 27.10 ఎకరాలు

image

AP: VSP IT సెక్టార్లో 27.10 ఎకరాలు కేవలం 99 పైసలకే ‘రహేజా’కు ఇస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. అదనంగా ఆర్థిక రాయితీలు ఇస్తామంది. పైగా ₹91.20CRతో రోడ్లు, నీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తామంది. కాగా ₹2172.26 CRతో ఐటీ, రెసిడెన్షియల్ స్పేస్ నిర్మిస్తామని, 9681 జాబ్‌లు కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. ₹కోట్ల విలువైన భూమిని సదుపాయాలు కల్పించి మరీ 99 పైసలకే ‘రియల్’ సంస్థకు ఇవ్వడంపై అనేక ప్రశ్నలొస్తున్నాయి.

News November 13, 2025

వచ్చే జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి: మంత్రి లోకేశ్

image

భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు 2026 జూన్‌ నాటికి పూర్తి కానుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర పెట్టుబడులకు గేట్‌వేగా మారబోతోందన్నారు. అంతర్జాతీయ కనెక్టివిటీతో ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు, వివిధ పరిశ్రమల ద్వారా మరో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నామన్నారు.