News November 13, 2025
ASF: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్

రాజీమార్గాన సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 15న ఆసిఫాబాద్ కోర్టు భవనంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, ఎన్ఐ యాక్ట్, కుటుంబ కలహాలు, వాహన ప్రమాదాలు, సివిల్, బ్యాంకు రికవరీ ఇతర కేసులకు సంబంధించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.
Similar News
News November 13, 2025
ఈనెల 15న రాజమహేంద్రవరంలో జాబ్ మేళా

ఈ నెల 15న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరిచంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. 10వ తరగతి ఆపై చదివి, 19-40 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు.
News November 13, 2025
పంట ఉత్పత్తుల సేకరణ నిబంధనలు సడలించాలి: తుమ్మల

TG: వర్షాల ప్రభావం పడిన సోయాబీన్, మొక్కజొన్న, పత్తి సేకరణ నిబంధనలు సడలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. పంట ఉత్పత్తులు సేకరించేలా NAFED, NCCFలను ఆదేశించాలన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే సేకరించాలన్న CCI ప్రతిపాదనతో రైతులు నష్టపోతారని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. L1, L2, స్పాట్ బుకింగ్‌లతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
News November 13, 2025
వరంగల్: మేలు చేసిన సినిమా బంధం..!

ఆయన ఇద్దరితో సినిమా తీశాడు. ఇద్దరికీ ఎంతో దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య ఉన్న కేసును సైతం రాజీ పడేలా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సంచలనాలకు కేరాఫ్‌గా ఉండే కొండా మురళి దంపతులకు, ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో ఉండే డైరెక్టర్ RGVని కొండా సినిమా దగ్గర చేసింది. ఆ పరిచయంతో శివ రీ రిలిజ్ సందర్భంగా నాగార్జునతో సురేఖపై ఉన్న పరువు నష్టం కేసు రాజీ కోసం ప్రయత్నం చేయడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.


