News November 13, 2025

సిరిసిల్ల జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా, అందులో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు, సీసీఐ ఆధ్వర్యంలో మరో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.

Similar News

News November 13, 2025

కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

కుష్టువ్యాది నిర్మూలన కార్యాక్రమంలో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేశారు. జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఈ వ్యాధి గుర్తింపు, నిర్ధారణకు జరిగిన కార్యక్రమంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు.

News November 13, 2025

యాదగిరిగుట్ట: కాలేజ్‌ను సందర్శించిన ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ

image

యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ సందర్శించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచడానికి ఆదేశించినటువంటి 90 రోజుల ప్రణాళిక గురించి కళాశాలలోని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

News November 13, 2025

ఓయూ ICSI డీన్‌గా ప్రొ.అప్పారావు

image

ఓయూ వాణిజ్య విభాగం మాజీ ఆచార్యులు, వాణిజ్య ఫ్యాకల్టీ మాజీ డీన్, వాణిజ్య బోర్డు ఆఫ్ స్టడీస్ మాజీ చైర్మన్ ప్రొ.అప్పారావు దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వృత్తిపరమైన సంస్థలలో ఒకటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI), న్యూఢిల్లీలో డీన్ (ఒప్పంద ప్రాతిపదికన)గా నియమితులయ్యారు. ఆయనను (ICSI-CCGRT-హైదరాబాద్) కేంద్రంలో నియమించారు. అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.