News November 13, 2025
కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్.. అప్డేట్ ఇచ్చిన మంత్రి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ విశాఖలో మాయా వరల్డ్‌ను VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలిసి గురువారం సందర్శించారు. మ్యూజియం వివరాలను మంత్రికి ప్రణవ్ వివరించారు. విశాఖకి వచ్చే పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించేలా మ్యూజియంను ఉందని, పర్యాటకానికి చిరునామాగా విశాఖ మారిందన్నారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్‌ను వచ్చే శివరాత్రి నాటికి, గ్లాస్ బ్రిడ్జిను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
Similar News
News November 13, 2025
HYD: రాబోయే రోజుల్లో చెమట సుక్కలే..!

ఏటా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. మహానగరంలో నిర్మాణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కాంక్రీట్ జంగల్‌గా మారుతుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్ల రిపోర్టును పరిశీలించిన అధికారులు రాబోయే రోజుల్లో 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.
News November 13, 2025
గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్ అబ్దుల్ సాద్ ఊనైస్

గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా అబ్దుల్ సాద్ ఊనైస్ ఎంపికయ్యాడు. అబ్దుల్ సాద్ ఊనైస్ బాపట్ల వాసి. రేపు శుక్రవారం నుంచి సెంట్రల్ జోన్ అండర్-14 జోన్ మ్యాచ్లు జరగనున్నాయి. చిన్న వయసు నుంచే క్రికెట్‌లో సత్తా చాటుతున్న అబ్దుల్ సాద్ గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల పలువురు క్రికెట్, క్రీడా ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 13, 2025
HYD: సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీల వైపు మళ్లింది?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని BRS వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొందరిని భయపెడుతుంటే మరికొందరిని సంతోషంలో ముంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో అనుకూలంగా వచ్చినవారు గెలుపు ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో మాట్లాడుతూ జోష్ ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ వైపు మళ్లిందనేది రేపు తేలనుంది.


