News November 13, 2025
వచ్చే జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి: మంత్రి లోకేశ్

భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు 2026 జూన్ నాటికి పూర్తి కానుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర పెట్టుబడులకు గేట్‌వేగా మారబోతోందన్నారు. అంతర్జాతీయ కనెక్టివిటీతో ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు, వివిధ పరిశ్రమల ద్వారా మరో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నామన్నారు.
Similar News
News November 14, 2025
టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

కోల్‌కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్‌ను కలిశా. భారత్‌ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.
News November 14, 2025
అన్నమయ్య జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

ప్రజల భద్రతే లక్ష్యంగా ‘విజిబుల్ పోలీసింగ్’ ముమ్మరం చేసినట్లు అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం గురువారం వెల్లడించింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి, వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
News November 14, 2025
జీవకోన వాసికి 14 రోజుల రిమాండ్

భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్‌ను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రామకిశోర్ వివరాల మేరకు.. గురువారం గంజాయి తరలిస్తున్న జీవకోన వాసి జగదీష్ (37)ను ఉదయం 10 గంటలకు గోవింద హోమ్ స్టే సమీపంలో పట్టుకున్నారు. 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.


