News November 13, 2025
కామారెడ్డి: బీసీ ఆక్రోశ సభకు మద్దతు ప్రకటించిన ఎలక్ట్రిసిటీ యూనియన్

కామారెడ్డిలో శనివారం జరగనున్న BC ఆక్రోశ సభకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం వారు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆహ్వాన కమిటీ ఛైర్మన్ మర్కంటి భూమన్న కో ఛైర్మన్లు క్యాతం సిద్ధ రాములు, బాలార్జున్ గౌడ్ సమక్షంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 42% BC రిజర్వేషన్ల సాధన కోసం నిరంతరం పోరాడుతామన్నారు.
Similar News
News November 14, 2025
అనకాపల్లి: ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలి’

అనకాపల్లి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థలు, ట్రస్టులు,సొసైటీలు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి మనోహర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో 10 లక్షల జనాభాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ నకలు, ఇతర అటాచ్మెంట్లు అందజేయాలన్నారు. దరఖాస్తు చేసే సంస్థలకు మూడేళ్ల ఆడిట్ రిపోర్ట్ ఉండాలన్నారు.
News November 14, 2025
తిరుమల: సాఫీగా ఇంటర్వ్యూలు

TTD వేద పారాయణదారుల పోస్టుల ఇంటర్వ్యూల్లో అకడమిక్ అబ్జర్వర్ తీరు గత మూడు రోజులుగా చర్చకు దారి తీసింది. ఈ మెయిల్స్ ద్వారా ఆయనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం Way2Newsలోనూ రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అబ్జర్వర్ పని మాత్రమే చేయాలని, ఇతర పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో గురువారం సాఫీగా ఇంటర్వ్యూలు జరిగాయి.
News November 14, 2025
చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.


