News November 13, 2025

ఓయూ ICSI డీన్‌గా ప్రొ.అప్పారావు

image

ఓయూ వాణిజ్య విభాగం మాజీ ఆచార్యులు, వాణిజ్య ఫ్యాకల్టీ మాజీ డీన్, వాణిజ్య బోర్డు ఆఫ్ స్టడీస్ మాజీ చైర్మన్ ప్రొ.అప్పారావు దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వృత్తిపరమైన సంస్థలలో ఒకటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI), న్యూఢిల్లీలో డీన్ (ఒప్పంద ప్రాతిపదికన)గా నియమితులయ్యారు. ఆయనను (ICSI-CCGRT-హైదరాబాద్) కేంద్రంలో నియమించారు. అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News November 14, 2025

కామారెడ్డిలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ‘కిడ్స్ విత్ ఖాకీ’

image

కామారెడ్డి జిల్లా పోలీస్‌ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9:30 గంటలకు నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ స్కిట్‌, అనంతరం 10:30 గంటలకు ట్రాఫిక్‌ ప్లెడ్జ్‌, అలాగే విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్లలో జరిగే విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

News November 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 14, 2025

వరంగల్: 24 అంతస్తుల్లో హాస్పిటలే ఉంటుంది: డీఎంఈ

image

వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల్లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని డీఎంఈ డా.నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రికి బదులుగా ఐటీ హబ్ అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.