News April 12, 2024

ప్రకాశం: నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల‌ భవితవ్యం

image

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని ఆర్ ఐవో సైమన్ విక్టర్ చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను 39,377మంది రాశారు. వీరిలో 19,233 మంది మొదటి సంవత్సరం, 18,128 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం కొన్ని నిమిషాలలో తేలనుంది. ఇప్పటికే విద్యార్థులు ఫలితాల కోసం నెట్ సెంటర్ల వద్దకు చేరారు.

Similar News

News March 1, 2026

ఒంగోలు ప్రజాప్రతినిధులతో చర్చించిన CM

image

చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోల బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు.

News March 1, 2026

మార్కాపురం: ‘కళాశాలే లేదు.. పరీక్షలు మాత్రం రాస్తారు’

image

మార్కాపురంలో BED పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 10 కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారు చదువుతున్న కళాశాల ఎక్కడో వారికే తెలీదు. మధ్యవర్తులు హాల్ టికెట్ ఇస్తే పరీక్ష రాస్తారు అంతే. కళాశాల భవనాలు కూడా ఉండవు కానీ అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఉంటాయి. ఇలాంటి ఆఫర్ మళ్లీ తెలుగువారికి లేదట. ఈ పరిస్థితి కందుకూరులోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 1, 2026

ఒంగోలు బస్టాండ్ అభివృద్ధి వైపు కలెక్టర్

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ను స్వయంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో బస్టాండ్ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.