News April 12, 2024

పాలమూరులో అడుగంటుతున్న భూగర్భ జలాలు

image

పాలమూరు జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. నాలుగేళ్ల క్రితం భూగర్భ జలాలు 10 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు వెళ్లగా ప్రస్తుతం జిల్లాలో 11.43 మీటర్ల లోతుకు నీరు వెళ్లిపోయింది. 2020 తరువాత ఈ స్థాయిలో లోతుకు నీరు వెళ్లడం ఇదే తొలిసారి. గతేడాది మార్చిలో 7.97 మీ. లోతులో నీరుండగా ప్రస్తుతం గతేడాదికి అదనంగా మరో 3.46 మీ. లోతుకు నీరు వెళ్లిపోవడంతో బోర్లలో నీటిమట్టం తగ్గిపోతోంది.

Similar News

News September 12, 2025

MBNR: OCT 16న PUలో స్నాతకోత్సవం

image

పాలమూరు యూనివర్సిటీలో వచ్చేనెల 16న 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి కె.ప్రవీణ Way2Newsతో తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్స్‌లలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అన్ని కోర్సుల్లో 88 గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ స్నాతకోత్సవనికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారు. యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.

News September 12, 2025

MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అడ్డాకుల 23.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. చిన్నచింతకుంట 23.3, బాలానగర్ 15.3, మిడ్జిల్ 13.3, హన్వాడ 11.0, మహమ్మదాబాద్ 10.8, కౌకుంట్ల 7.3, సల్కర్ పేట 7.3, భూత్పూర్ 6.3, నవాబుపేట 6.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డు అయింది.

News September 11, 2025

జడ్చర్ల: ఎరువు విక్రయ కేంద్రాల తనిఖీ

image

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.