News April 12, 2024
సిక్కింలో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ ప్రయోగం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ (ATGM)ను భారత ఆర్మీ ప్రయోగించింది. త్రిశక్తి కార్ప్స్ ఆధ్వర్యంలో సిక్కింలోని గువాహటి సమీపంలో 17 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించారు. పర్వత ప్రదేశాల నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించనున్నారు. ఈ మిస్సైల్స్ ఒక సైనికుడు తీసుకెళ్లేంత చిన్నవిగా ఉంటాయి.
Similar News
News November 16, 2024
పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. BCCI బాటలోనే కబడ్డీ టీమ్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. PAKలో జరిగే ఫ్రెండ్లీ గేమ్స్ కోసం భారత కబడ్డీ జట్టును పంపేది లేదని తేల్చింది. దీంతో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. కాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్ ఆదాయానికి గండి పడినట్లయింది. సెక్యూరిటీ కారణాల వల్లే ఆటగాళ్లను పంపించట్లేదని కేంద్రం అంటోంది.
News November 16, 2024
IIT మద్రాసుతో 8 ఒప్పందాలు: మంత్రి లోకేశ్
AP: రాష్ట్ర ప్రభుత్వం IIT మద్రాసుతో 8 రకాల ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. CRDA, మ్యారీ టైం బోర్డు, స్కిల్ డెవలప్‌మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, IT, RTGS శాఖలతో IIT మద్రాస్ ఒప్పందాలు కుదిరాయని ఆయన అన్నారు. ఐఐటి మద్రాసు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించిన అనంతరం కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
News November 16, 2024
మిలిటరీ హెలికాప్టర్‌లో బ్రిటిష్ సైనికుల శృంగారం!
UKలోని సైనిక శిక్షణా ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు హద్దులు దాటారు. రూ.75 కోట్ల మిలిటరీ హెలికాప్టర్ కాక్‌పిట్‌లో శృంగారం చేస్తూ దొరికిపోయారు. ఇద్దరూ మద్యం తాగినట్లు అధికారులు గుర్తించారు. అర్ధనగ్నంగా ఉన్న వారికి వెంటనే దుస్తులు ధరించాలని సూచించారు. పురుషుడు ఆర్మీ యూనిఫాంలో ఉండగా మహిళ మాత్రం సాధారణ దుస్తుల్లో ఉన్నారు. అయితే ఈ సంఘటన 2016లో జరిగిందని, ఇప్పుడు వైరలవుతోందని ‘ది సన్’ పేర్కొంది.