News April 12, 2024
ఇంటర్ రిజల్ట్స్.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు

ఏపీ ఇంటర్ బోర్డు కాసేపట్లో ఫలితాలు విడుదల చేయనుంది. విద్యార్థులు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు వారికి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఆందోళనలో ఉన్నా, తల్లిదండ్రులు లేదా సన్నిహితులు ఇంటర్ విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నట్లు గమనిస్తే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఆ నంబర్లు పైన ఇమేజ్‌లో చూడవచ్చు.
Similar News
News January 8, 2026
66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా ఔట్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ నేతృత్వంలోని ‘సోలార్ అలయన్స్’ సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థలు US జాతీయ ప్రయోజనాలకు, ఆర్థిక వృద్ధికి, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. ముఖ్యంగా ‘గ్లోబలిస్ట్’ అజెండాలు, రాడికల్ క్లైమేట్ పాలసీల పేరుతో US పన్ను చెల్లింపుదారుల సొమ్ము బిలియన్ల కొద్దీ వృథా అవుతోందని చెప్పుకొచ్చింది.
News January 8, 2026
షూటర్‌పై లైంగిక వేధింపులు.. కోచ్ సస్పెండ్!

నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై 17 ఏళ్ల షూటర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలి కుటుంబం పేర్కొంది. దీనిపై స్పందించిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ఆయన్ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నారు. హోటల్ CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
News January 8, 2026
ట్రంప్ సంచలనం.. భారత్‌పై 500 శాతం సుంకాలు?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి సహకరించేలా రష్యా చమురు కొనుగోలును కొనసాగించే దేశాలపై 500 శాతం వరకు సుంకాలను విధించే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి వచ్చేవారం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దీనిపై రిపబ్లికన్ సెనెటర్ లిన్సే Xలో చేసిన పోస్టు ఆందోళన రేకెత్తిస్తోంది. ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే.


