News April 12, 2024
నెల్లూరు: రూ.5.28 లక్షల మద్యం సీజ్

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు రూ.5,28,168 విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశామన్నారు. పొరుగు మద్యం విక్రయాలపై 3 కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనధికార విక్రయాలపై 191 కేసులు నమోదు చేసి 194 మందిని అరెస్ట్ చేశారు.
Similar News
News March 22, 2026
సైదాపురం మైకా గనులపై MP కన్ను: YCP

సైదాపురంలోని మైకా గనులను ఇష్టానుసారం తవ్వుకునేందుకు కూటమి పెద్దలు పథకం సిద్ధం చేశారని YCP ఆరోపించింది. ‘ఇప్పటికే లీజు ముగిసిపోయిన గనుల్లో ఇంకా తవ్వకాలు జరుపుతూ రూ.వందల కోట్ల పెనాల్టీకి గురైన సంస్థలను ప్రభుత్వం వెనకేసుకు వస్తోంది. ఆ పెనాల్టీ చెల్లించనక్కర లేకుండానే వారికి లీజును కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేస్తోంది. దీని వెనక TDP ముఖ్య నేతతో పాటు MP ఉన్నట్లుగా తెలిసింది’ అంటూ ‘X’లో రాసుకొచ్చింది.
News March 22, 2026
నెల్లూరులో దారుణ హత్య.. మృతుడి వివరాలు ఇవే!

నెల్లూరు బోడిగాడి తోటలోని శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి<<19446783>> దారుణ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. నవాబ్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వీర్ క్రాంత్ అని, వలస కూలీ అని చెబుతున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా వివరాలు తెలిసినట్టు సమాచారం.
News March 22, 2026
నెల్లూరు నగరంలో దారుణ హత్య!

నెల్లూరు నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని ఈ హత్య చేసి కాల్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


