News April 12, 2024
లిక్కర్ స్కాంలో కవిత కీలక సూత్రధారి: CBI

లిక్కర్ స్కాంలో MLC కవిత కీలక సూత్రధారి అని CBI పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ వాదనలు వినిపిస్తోంది. ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన NOC పొందడంలో మాగుంట రాఘవకు సహకరించేందుకు కవిత ప్రయత్నించినట్లు ఆమె CA వాట్సాప్ చాటింగ్‌లో తేలిందని పేర్కొంది. ఢిల్లీ, HYDలో ఈ స్కాంకి స్కెచ్ వేసినట్లు వెల్లడించింది. కవిత సౌత్ గ్రూప్ నుంచి రూ.100కోట్లు సమీకరించి.. ఆప్ నేతలకు ఇచ్చినట్లు ఆరోపించింది.
Similar News
News November 1, 2025
అదునులో పొదలో చల్లినా పండుతుంది

సక్రమంగా వర్షాలు కురిసి, నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఒకవేళ నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. అలాగే సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయం తప్పక లభిస్తుందని తెలియజెప్పే సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు.
News November 1, 2025
2 రోజుల్లో అల్పపీడనం.. AP, TGలో వర్షాలు

రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అటు TGలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది.
News November 1, 2025
నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ

TG: ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. ₹100 ఫైన్‌తో ఈ నెల 16-24, ₹500తో ఈ నెల 26 నుంచి DEC 1 వరకు, ₹2వేల జరిమానాతో DEC 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. ENG ప్రాక్టికల్స్‌కు ₹100 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ కు ₹630, ఫస్టియర్ ఒకేషనల్‌కి ₹870, సెకండియర్ ఆర్ట్స్‌కు ₹630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్‌కి ₹870 చెల్లించాలి.


