News April 12, 2024
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.
Similar News
News January 30, 2026
KNR: యాప్ ద్వారానే యూరియా పంపిణీ: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో ఈనెల 31 నుంచి యూరియా విక్రయాలు కేవలం ‘ఎరువుల బుకింగ్ యాప్’ ద్వారానే జరుగుతాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యాప్‌లో ముందే బుక్ చేసుకుని డీలర్ వద్ద కొనుగోలు చేయాలని చెప్పారు. పట్టాదారు పాస్‌బుక్ మొబైల్ నంబర్‌కు అనుసంధానమై ఉండాలని, కౌలు రైతులు యజమాని ఓటీపీతో బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ గడువు మరుసటి రోజు అర్ధరాత్రి వరకే ఉంటుందని,రెండో విడతకు 15 రోజుల విరామం ఉంటుందన్నారు.
News January 30, 2026
KNR: సీపీపై ఎమ్మెల్యే ఆరోపణలు.. ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం

కరీంనగర్ సీపీ గౌష్ ఆలంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారి మతాన్ని ప్రస్తావిస్తూ, మత మార్పిడి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రెచ్చగొట్టే ధోరణితో చేసిన ఈ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు పోలీసుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.
News January 30, 2026
KNR: గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు

కరీంనగర్ జిల్లాలోని గిరిజన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) కె.సంగీత తెలిపారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు ‘న్యూ స్కీమ్’ కింద, 9, 10వ తరగతి విద్యార్థులు ‘రాజీవ్ విద్యా దీవెన’ పథకం ద్వారా ఈపాస్ (e-pass) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను వెంటనే కార్యాలయంలో సమర్పించాలన్నారు.


