News April 12, 2024
కవిత కేసులో మ.2గంటలకు తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కోర్టు తీర్పును మధ్యాహ్నం 2గంటలకు రిజర్వ్ చేసింది. ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో CBI హాజరుపర్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Similar News
News February 12, 2026
టెన్త్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు!

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేషన్ చేస్తుండగా, ఇకపై ప్రైవేటు టీచర్లకూ అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి 25% మంది ప్రైవేటు టీచర్లను తీసుకోనుంది. ఆన్‌లైన్ విధానంలో ఇన్విజిలేషన్ బాధ్యతలు కేటాయించనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 4 నుంచి 10 రోజులు జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది.
News February 12, 2026
కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా?

కళ్లజోడు ముఖానికి సరిపోదనో, కళ్ల రంగు మారిస్తే ఫ్యాషన్ అనో చాలామంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాడటంలో అజాగ్రత్తగా ఉన్నా కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి స్టైల్‌తో పాటు ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
News February 12, 2026
‘టీ’ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీ కోసమే!

చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రీహీట్ వల్ల చాయ్ చేదుగా, అసిడిటిక్‌గా మారుతుంది. కడుపులో తిప్పడం, అసిడిటీ, హార్ట్‌బర్న్, ఛాతీలో మంట ఏర్పడొచ్చు. అందులో చేరుకున్న బాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావొచ్చు. తాజా టీతో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. అందుకే ఫ్రెష్‌గా తాగండి. వాడిన పొడిని మళ్లీ వాడొద్దు’ అని చెబుతున్నారు.


