News November 14, 2025
ADB: ఈనెల 19న బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-17 జిల్లాస్థాయి బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని కోరారు. పాల్గొనేవారు తప్పనిసరిగా సొంతంగా క్రికెట్ కిట్, యూనిఫాం తీసుకురావాలని సూచించారు.
Similar News
News March 2, 2026
ADB: పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు బంగారుగూడ, జైనథ్, బజార్హత్నూర్, నార్నూర్, గుడిహత్నూర్, బోథ్ ప్రవేశ పరీక్ష -2026-27 విద్యా సంవత్సరానికి VI తరగతిలో ప్రవేశాలకు గడువు తేదీని పొడగించినట్లు DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే VII నుంచి X తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ మార్చి10 వరకు పొడగించమన్నారు. ఏప్రిల్ 19న పరీక్ష ఉంటుందని తెలిపారు.
News March 2, 2026
ADB: ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ – 100’ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో హెల్త్ మిషన్ – 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
News March 2, 2026
ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.


