News November 14, 2025
జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఇక్కడే

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మన్నెగూడెంలో 10.7℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కథలాపూర్ 11, గొల్లపల్లి 11.2, రాఘవపేట 11.2, ఐలాపూర్ 11.3, మల్లాపూర్ 11.4, మద్దుట్ల 11.4, పెగడపల్లి, రాయికల్ 11.5, మల్యాల 11.7, జగ్గాసాగర్ 11.8, పూడూర్ 11.9, మేడిపల్లి, నేరెల్ల 12, గోదూరు, కోరుట్ల 12.2, అల్లీపూర్, పొలాస 12.3, మెట్‌పల్లె, జగిత్యాల 12.5, సారంగాపూర్లో 12.8℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News December 8, 2025
వరంగల్: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. MHBD(D)లోని అబ్బాయిపాలెంకు చెందిన సత్యం(60) కల్లు గీస్తున్న క్రమంలో ఈతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఉనికిచర్ల సమీపంలో బైక్ కల్వర్టులోకి దూసుకెళ్లి ధర్మసాగర్(M)కి చెందిన యోగేశ్వర్ మృతి చెందాడు. NSPT(M) రాజేశ్వరరావుపల్లి <<18497665>>మాజీ సర్పంచ్<<>> యువరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. వీధికుక్కల దాడిలో 8 గొర్రెలు మృతిచెందిన ఘటన కంబాలపల్లిలో జరిగింది.
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. చంద్రబాబు విషెస్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు, రేపు జరిగే ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని Xలో పోస్టు చేశారు. కాగా ఈ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు.
News December 8, 2025
విజయవాడలో ప్రత్యక్షమైన వైసీపీ నేత..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్ ప్రధాన అనుచరుడు విజయవాడ పటమట పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ప్రసాదంపాడుకి చెందిన కొమ్మకోట్లు సోమవారం ఉదయం సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోవడానికి వచ్చాడు. ఈ క్రమంలో వైసీపీ అనుచరులు భారీ సంఖ్యలో పటమట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కొమ్మకోట్లు గత పది నెలలుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే.


