News April 12, 2024
ఇంటర్ ఫలితాలలో మన గుంటూరు రెండో స్థానం

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 87 శాతంతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. 26,007 మంది పరీక్షలు రాయగా 22,673 మంది పాసయ్యారు. పల్నాడు జిల్లా 73 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. 12,087 మంది పరీక్షలు రాయగా 8,870 మంది పాసయ్యారు. బాపట్ల జిల్లా 71 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 7995 మంది పరీక్షలు రాయగా 5709 మంది పాసయ్యారు.
Similar News
News March 19, 2026
గుంటూరులో 8 మంది అధికారులపై వేటు

GNT నగరపాలక సంస్థలో అక్రమ కట్టడాలకు సహకరించిన 8 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. శారద, వెంకటరావమ్మ, రిజ్వానా, మల్లికార్జున, సురేఖ, హరిజానాయక్, అశోక్ కుమార్, సత్యనారాయణలపై AP సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
News March 18, 2026
తుళ్లూరులో పిడుగు పడి వ్యక్తి మృతి

తుళ్లూరులోని మేరీమాత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో పిడుగు పడి విద్యార్థి తండ్రి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి 2వ తరగతి చదువుతున్న కుమార్తెను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లిన శ్రీనివాస్ పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడు స్వగ్రామం రాజమండ్రి కాగా BSR కంపెనీలో సర్వేయర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2026
GNT: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. మార్కులే జీవితంలో ముఖ్యం కాదని చెప్పారు.


