News April 12, 2024
మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంపై అందరి గురి..!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తున్నాయి. అంతేకాకుండా సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టాయి . ఇక్కడ గెలుపోటములు ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Similar News
News March 20, 2026
MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
News March 20, 2026
MBNR: రంజాన్.. బందోబస్తు ఏర్పాట్లపై నిఘా

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఇద్గా వక్ఫ్-ఎ-రహ్మానియా వద్ద అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్‌కు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.