News November 15, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. తుమ్మల వ్యూహం సక్సెస్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తుమ్మలను సీఎం రేవంత్ వెంగళరావు నగర్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కమ్మ కీలక నేతలను సీఎం రేవంత్ రెడ్డితో సమావేశపరిచి, హామీలు ఇప్పించారు. ఈ సామాజిక సమీకరణాల ద్వారానే కాంగ్రెస్ విజయం సాధించిందని, తుమ్మల వ్యూహం ఫలించిందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్.

Similar News

News November 15, 2025

సంగారెడ్డి: సర్వే చేయించుకున్నారు.. పైసలిస్తలేరు!

image

జిల్లాలో గత ఏడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకు పారితోషకాన్ని చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే చేసి ఏడాది గడిచిన పారితోషకం చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారితోషకాన్ని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

News November 15, 2025

రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

image

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.

News November 15, 2025

యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

image

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్‌ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.