News November 15, 2025
అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు

ఈ నెల 19 నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News November 15, 2025
ఇకనైనా ‘వలస’ జీవులకు విముక్తి లభించేనా?

బిహార్‌లో మరోసారి ఎన్డీఏ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది తిరిగి తమ ఉపాధి క్షేత్రాలకు తిరిగిరానున్నారు. ఈక్రమంలో ఏళ్లు గడుస్తున్నా వలస జీవుల బతుకులు మారట్లేదని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇకనైనా కంపెనీలు నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.
News November 15, 2025
APPLY NOW: RRUలో 9 పోస్టులు

గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<
News November 15, 2025
మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.


