News November 15, 2025

చేపల సాగులో ఆదర్శంగా నిలిచిన విజయ కుమారి

image

బాపట్ల జిల్లా నగరం మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన ఆక్వా రైతు విజయకుమారి పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా చేపల సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ లబ్ధి పొందుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా తక్కువ నీటితో నాణ్యత గల చేపలను ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నారని పేర్కొంది. పలువురు ఆక్వా రైతులకు ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడింది.

Similar News

News December 8, 2025

9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

image

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.

News December 8, 2025

జగ్గయ్యపేట: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

రెండు రోజుల క్రితం జగ్గయ్యపేటలో కలకలం సృష్టించిన హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో సాయి పోలీసులపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. అయినప్పటికీ పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ చేపట్టారు.

News December 8, 2025

సాలూరు: విహారయాత్రకు వెళ్లి ఒకరి మృతి

image

సాలూరు (M) దళాయివలస జలపాతం వద్ద ఆదివారం ఒకరు మృతి చెందారు. రామభద్రపురానికి చెందిన హరి స్నేహితులతో కలిసి విహారయాత్రకు జలపాతానికి వెళ్లాడు. జలపాతం దిగువ ప్రాంతంలో ఈతకు వెళ్లి ఊబిలో కురుకుపోవడంతో స్థానికుల సహకరంతో హరిని బయటకు తీసి సాలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.