News April 12, 2024

మన్యం: మొదటి రేండమైజేషన్ పూర్తి

image

జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొదటి రేండమైజేషన్ శుక్రవారం పూర్తి అయ్యింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేండమైజేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రేండమైజేషన్ విధానాన్ని వివరించారు. రేండమైజేశన్ ద్వారా ఏ ఈవీఎం ఏ నియోజక వర్గానికి వెళుతుందో వివరించారు.

Similar News

News September 27, 2025

పైడితల్లమ్మ పండగ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు: SP

image

పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనం, సినిమానోత్సవంలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. సినిమాను తిరిగే మార్గంలో ప్రెజర్ పాయింట్స్ వద్ద మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

News September 26, 2025

సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు: కిమిడి

image

సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. శుక్రవారం ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ జిల్లా మహాజన సభ డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గోంప కృష్ణ మాట్లాడుతూ..డీసీఎంఎస్‌ను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

News September 26, 2025

VZM: 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే అధికంగా ఓటర్లు

image

పోలింగ్ కేంద్రాల హేతుబ‌ద్దీక‌ర‌ణ ప్ర‌క్రియ‌కు రాజ‌కీయ పార్టీల‌న్నీ స‌హ‌క‌రించాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి కోరారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో విజయనరగరం కలెక్టరేట్‌లో శుక్రవారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలో 126 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. 1200 కంటే ఎక్కువ ఉన్నచోట అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.