News November 15, 2025
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

TG: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో జీవ, భౌతిక, సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టు మెటీరియల్సే అందజేసేది. ఈసారి వాటితో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకూ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈనెలలో పంపిణీ చేసేందుకు 2 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.7.52 లక్షల స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేయిస్తోంది.
Similar News
News November 15, 2025
మోడల్ సిటీగా శ్రీసిటీ విస్తరణ: CBN

AP: మరో 50 కంపెనీల ఏర్పాటుకు వీలుగా 6వేల ఎకరాలతో శ్రీసిటీని విస్తరిస్తామని CBN తెలిపారు. 1.5 లక్షల ఉద్యోగాలతో ఇది మోడల్ సిటీగా మారుతుందన్నారు. బెల్జియం, జపాన్, UK, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలకు అనుమతులిచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. CII సదస్సులో 5 యూనిట్లను వర్చువల్‌గా CM ప్రారంభించారు.
News November 15, 2025
ముగిసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్

సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 189/9 పరుగులకు పరిమితమైంది. గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. KL రాహుల్(39), సుందర్(29) పంత్(27), జడేజా(27) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. SA బౌలర్లలో సిమోన్ 4, జాన్‌సెన్ 3 వికెట్లు, మహరాజ్, బోష్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియాకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
News November 15, 2025
రెండో రోజు CII సమ్మిట్ ఫొటో గ్యాలరీ

AP: విశాఖలో CII సమ్మిట్ రెండోరోజు కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సదస్సు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే అధినేతలకు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలుకుతున్నారు. సమ్మిట్‌లోని పలు స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. యువత కూడా ఉత్సాహంగా హాజరవుతున్నారు.


