News April 12, 2024

చిత్తూరు MLA అభ్యర్థులపై కేసు నమోదు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 18 నోటిఫికేషన్ రానుందని.. అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలో నిన్నటి రంజాన్ వేడుకల్లో ఉద్రిక్తతకు కారణమైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విజయానందరెడ్డి, గురుజాల జగన్మోహన్‌పై 171 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.

Similar News

News March 14, 2026

చిత్తూరు: 108లో ఉద్యోగాలు

image

చిత్తూరు జిల్లాలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT), పైలట్(Driver) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయవాడలోని గొల్లపూడి ఏరియా మైనార్టీ కమ్యూనిటీ హాల్లో శని ఆదివారం సెలక్షన్స్ నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూ‌కు హాజరు కావాలని జిల్లా మేనేజర్ మోహన్ బాబు, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జగదీశ్ కోరారు.

News March 14, 2026

పూతలపట్టు ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

image

పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌పై నమోదైన కేసును చిత్తూరు జిల్లా ఫస్ట్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. యాదమరి మండలం కాశిరాళ్ల వద్ద 2023లో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో యాదమరి పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌తో పాటు ఇతర నాయకులపై నమోదైన కేసును రద్దు చేసింది.

News March 13, 2026

చిత్తూరు: ముగ్గరికి రెండేళ్ల జైలు శిక్ష

image

ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్‌లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారు. నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్‌కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు.