News April 12, 2024
వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా రాజయ్య

TG: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. చాలా కాలంగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కడియం కావ్యకు రాజయ్యే సరైన ప్రత్యర్థి అవుతారని భావించి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఆరూరి రమేశ్ బరిలో ఉన్నారు.
Similar News
News March 25, 2026
చమురు వణుకుపుట్టిస్తోంది!

ప్రపంచంలో ఆయిల్ కొరత అతిపెద్ద సమస్యగా మారింది. గల్ఫ్‌తో పాటు ఇతర వనరులూ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రత్యామ్నాయం అనుకున్న రష్యన్ రిఫైనరీలూ ఇప్పుడు టార్గెట్‌గా మారాయి. ఇటీవల రష్యా రిఫైనరీలోని కోటి లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు USలోని టెక్సాస్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఫలితంగా గ్లోబల్ సప్లై చెయిన్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

అమరావతిలో అగ్నిప్రమాదాలు.. దర్యాప్తు ముమ్మరం

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల L&T కంపెనీ, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే అవి 130 డిగ్రీల వేడికి తప్ప చిన్న మంటలకు దగ్ధం కావనేది నిపుణుల అభిప్రాయం. కాగా వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉండొచ్చని <<19466902>>CM అనుమానం<<>> వ్యక్తం చేశారు.