News November 15, 2025
జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News November 15, 2025
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం పార్వతీపురం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరుగుతుందని అందుకు తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
News November 15, 2025
వట్టి నేలపై కూర్చోకూడదా?

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>
News November 15, 2025
రేణిగుంట ఎయిర్‌పోర్టులో సీజేఐకి ఆత్మీయ వీడ్కోలు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ తిరుపతి పర్యటనను ముగించుకుని శనివారం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ద్వారా ఢిల్లీకి తిరుగుప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సీజేఐకి జ్ఞాపికను అందించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. అధికారులు, న్యాయవర్గ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


