News November 15, 2025
విశాఖలో రెండో రోజు CII సమ్మిట్

విశాఖలో CII సమ్మిట్ నేటితో ముగియనుంది. నిన్న సుమారు 400 MOUలు జరగ్గా.. నేడు గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు చేపట్టనున్నారు. మంత్రి లోకేశ్ అధ్యక్షతన ‘AI అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ జరగనుంది.
Similar News
News November 15, 2025
భూపాలపల్లి: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

భూపాలపల్లి జిల్లా చిట్యాల, గణపురం(ములుగు), మల్హర్‌రావు, మహాముత్తారం, పలిమెల, టేకుమట్ల, మహదేవ్‌పూర్ నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 15, 2025
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం పార్వతీపురం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరుగుతుందని అందుకు తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
News November 15, 2025
వట్టి నేలపై కూర్చోకూడదా?

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>


