News November 15, 2025

GNT: నేటి నుంచి RTCలో అప్రెంటిస్‌షిప్ దరఖాస్తులు

image

APSRTCలో ITI అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్‌ 15 నుంచి 30 వరకు అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకోవాలని RTC సూచించింది. జిల్లాల వారీగా కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో ఖాళీలు ప్రకటించగా, ట్రేడ్ల వారీగా ఎంపికలు జరగనున్నాయి. కాగా పై జిల్లాలో ఉన్న I.T.I. కాలేజీల నుంచి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

Similar News

News November 15, 2025

తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

News November 15, 2025

పెద్దపల్లి: NOV 14 – 20 వరకు సహకార వారోత్సవాలు

image

PDPL జిల్లాలో NOV 14-20 వరకు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ప్రతిరోజు ప్రత్యేక అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. డిజిటలైజేషన్‌, గ్రామీణాభివృద్ధి, సహకార విద్య, మహిళ-యువత సాధికారత, గ్రీన్ ఎనర్జీ, టూరిజం వంటి విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సహకార అధికారి శ్రీమాల పాల్గొన్నారు.

News November 15, 2025

GWL: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

image

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం ఐడీఓసీ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా జరగాలన్నారు. రైతులకు ముందస్తుగా తేమశాతం పై ఏఈఓ లు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన పత్తి, ధాన్యం కేంద్రానికి వచ్చే విధంగా చూడాలన్నారు.