News November 15, 2025

30 ఓట్లతో గెలిచాడు

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒకే ఒక్క సీటు గెలిచింది. రామ్‌గఢ్ నుంచి పోటీ చేసిన సతీశ్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్లతో గట్టెక్కారు. ఆయనకు 72,689 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్‌ సింగ్‌కు 72,659 ఓట్లు పడ్డాయి. చివరి వరకూ ఇద్దరి మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా సతీశ్‌నే వరించింది. ఇక బిహార్‌లో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 15, 2025

తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

News November 15, 2025

రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

image

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.

News November 15, 2025

తండ్రయిన రాజ్‌కుమార్

image

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.