News November 15, 2025

సంగారెడ్డి: కన్నతల్లిని హతమార్చిన కొడుకు

image

కోహీర్ మండలం బడంపేటలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు బాలరాజ్ తల్లిని హత్య చేశాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన బాలరాజ్ డబ్బుల కోసం 3 రోజుల నుంచి తల్లి పద్మమ్మ (52)తో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంతో తల్లిని గోడకు కొట్టాడు. దీంతో స్పాట్‌లోనే మృతి చెందింది. బాలరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 15, 2025

కామారెడ్డి: ప్రభుత్వ పీజీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

కామారెడ్డిలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో MA (ఇంగ్లీష్, తెలుగు, ఎకనామిక్స్,పొలిటికల్ సైన్స్), MSW, MCom, MSc (బాటని, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఫిషరీస్) మొత్తం 12 కోర్సుల్లో మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.‌‌

News November 15, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఏ ఎన్నికలైనా బిహార్ లాంటి ఫలితాలే NDAకు వస్తాయి: బీజేపీ ఎంపీ పురందీశ్వరి
* లిక్కర్ కేసులో అరెస్టయిన అనిల్ చోఖ్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.
* సింగపూర్-విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి.
* పరకామణి కేసులో సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. గుంతకల్ రైల్వే స్టేషన్‌లో అతని బైక్‌ను పోలీసులు గుర్తించారు.

News November 15, 2025

కాగజ్‌నగర్: విద్యార్థులకు రేపు అవగాహన సదస్సు

image

కాగజ్‌నగర్‌: డా. బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌లో చదువుతున్న డిగ్రీ I, II, III సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 16న ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. శ్రీదేవి, కోఆర్డినేటర్ తూడూరు దత్తాత్రేయ తెలిపారు. తరగతులకు సంబంధించిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని వారు సూచించారు.